కార్తీకమాసం స్పెషల్: జబ్బులన్నీ నయం!
కార్తీకమాసం 10వ రోజు దశమి తిథికి ప్రత్యేకత ఉంది. చాలామందికి దగ్గు, జలుబు, ఆస్తమా, బ్రాంకోటిస్ తదితర సమస్యలు ఉంటాయి. శీతల సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు చాలామంది ఉంటారు. వారంతా శీతల సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో 10వ రోజు సూర్యాస్తమయం తర్వాత కందిపప్పు, నెయ్యి దేవాలయంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. దీంతో వ్యాధులన్నీ తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు.