తూర్పు జోన్ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ
విశాఖ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి ఈస్ట్ జోన్ సమస్యలపై శనివారం సమీక్ష నిర్వహించారు. తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.