VIDEO: ఆవుల యజమానులకు అధికారుల హెచ్చరిక

NDL: ఆళ్లగడ్డలో ఆవులను యజమానులు ఇళ్లలో ఉంచి మేపకుండా రోడ్లపై వదులుతుండటంతో అవి ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంఛార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ.. విచ్చలవిడిగా రోడ్లపై ఆవులు మందలుగా ఏర్పడి సంచరిస్తుండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందన్నారు. ఆవులు రోడ్లపైకి రాకుండా యజమానులు ఇంటి వద్దే షెల్టర్ వేసుకుని చూసుకోవాలని సూచించారు.