VIDEO: పైపు లీకేజీతో నీరు వృధా
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డు NH-67 ఎదురుగా మున్సిపల్ పైపు డ్యామేజ్ అవ్వడంతో నీరు వృధా అవుతోంది. గతంలో నీటి లీకేజీని గమనించి మరమ్మతులు చేసినప్పటికీ, అదే పైపులో వేరే చోట డ్యామేజ్ ఏర్పడింది. దీనివల్ల అమూల్యమైన నీరు వృధాగా పోతోంది. లీకేజీను అరికట్టి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.