ALERT: మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్
JEE అడ్వాన్స్‌డ్-2026 ఈసారి మే 17న జరగనుంది. దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఐఐటీల్లో ప్రస్తుతం 18,160 సీట్లు ఉన్నాయి.