ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానా

ప్లాస్టిక్ వినియోగిస్తున్న వ్యాపారులకు జరిమానా

VSP: ప్లాస్టిక్ వాడొద్దని అధికార యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా వ్యాపారులు వినడం లేదు. ఇంకా ప్లాస్టిక్ కవర్లలను విక్రయిస్తున్నారు. హనుమంతువాక జంక్షన్, పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో శుక్రవారం ఉదయం సచివాలయ సిబ్బంది తనిఖీలు నిర్వహించి పలువురికి జరిమానా విధించారు. 20 దుకాణాల్లో రెండు కేజీల ప్లాస్టిక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.