100 డాలర్లు దాటిన బ్యారెల్ చమురు

100 డాలర్లు దాటిన బ్యారెల్ చమురు

పశ్చిమాసియా యుద్ధ మేఘాలతో ముడిచమురు ధరలు భగ్గుమంటున్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయం కలగడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 106 డాలర్లకు చేరగా, US ఆయిల్ 101 డాలర్లకు పెరిగింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ధరలు 40% మేర పెరిగి గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో జలసంధిని కాపాడి, ఇంధన రవాణాను పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.