శ్రీకాళహస్తిలో నిలిచిపోయిన ఎయిర్టెల్ సేవలు
TPT: శ్రీకాళహస్తి పట్టణం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఎయిర్టెల్ మొబైల్ నెట్‌వర్క్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు కాల్స్ చేయడం, ఇంటర్నెట్ ఉపయోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల సిగ్నల్ పూర్తిగా లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. నెట్‌వర్క్ సమస్యపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.