VIDEO: భూ రెవెన్యూ సమస్యల మీద అధిక ఫిర్యాదులు
AKP: నర్సీపట్నం RDO కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిపాలన అధికారి వెంకటరమణ ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ రెవెన్యూ సమస్యల మీద అత్యధికంగా 29 ఫిర్యాదులు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. అనంతరం AO మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు.