హెల్మెట్ లేనిపక్షంలో రూ. 1000 జరిమాన

KKD: కాకినాడ ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భానుగుడి సెంటర్లో వాహన చోదకులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఆయన ఆదేశించారు. లేనిపక్షంలో రూ. 1000 వంతున జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని సూచించారు.