పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మపురి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత పోలింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రూరల్ మండల పరిధిలోని అప్పాయి పల్లి, కోడూరు, జమిస్తాపూర్ పోలింగ్ కేంద్రాలను కూడా కలెక్టర్ సందర్శించారు.