నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
BDK: ఇల్లందు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.1, 2 నంబర్ బస్తీ పరిధిలోని హిందూ స్మశాన వాటిక వద్ద కొత్త ట్రాన్సా ఫార్మర్ ఏర్పాటు, కేజీ రోడ్ మార్కెట్ ఏరియాలోని ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ వద్ద 160 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు అన్నారు.