ఇంటర్‌లో పరీక్ష తప్పిన వారికి ఉచిత శిక్షణ
కృష్ణ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు తమ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కేబీఎన్ షైన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి. నరేంద్ర తెలిపారు. ఈ నెల 23 నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని అన్ని సబ్జెక్టులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.