దుర్గామాతకు బంగారు ముక్కుపుడక సమర్పణ

దుర్గామాతకు బంగారు ముక్కుపుడక సమర్పణ

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలోని దుర్గామాత అమ్మవారికి మానుపాటి ఉప్పలయ్య - చిన్నరాం దంపతులు ఆదివారం సుమారు రూ. 80,000 విలువైన బంగారు ముక్కుపుడకను కానుకగా సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఫిరోజ్ కూడా పాల్గొన్నారు.