VIDEO: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చిత్రా మిశ్రా, CP గౌస్ అలంలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.