'నవ ధాన్యాలతో అధిక దిగుబడులు'

VZM: వేసవి కాలంలో నవ ధాన్యాలు భూమిలో జల్లడంతో భూమిలో పోషకాలు వృద్ధి చెంది, అధిక దిగుబడులు వస్తాయని మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు తెలిపారు. శనివారం పాచిపెంట మండలం అమ్మవలస గ్రామంలో నవ ధాన్యాలు రైతులకు అందజేశారు. నవ ధాన్యాలు వరుసగా మూడు సంవత్సరాలు భూమిలో జల్లడం వలన రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుందని తెలిపారు.