ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
ASR: దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు.