‘భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

జగిత్యాల: రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు. అత్యసరమైతేనే బయటకి రావాలని, విద్యుత్ స్తంభాలకు, పరికరాలకు దూరంగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో సహాయం కోసం 100 ద్వారా పోలీసులను సంప్రదించాలన్నారు.