కనిగిరి మండలం అడ్డరోడ్డులో కూలిన భారీ వృక్షం

కనిగిరి మండలం అడ్డరోడ్డులో కూలిన భారీ వృక్షం

ప్రకాశం: కనిగిరి మండలం అడ్డరోడ్డులో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి పెద్ద వృక్షం కూలిపోయి రహదారిపై పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అధికారులు స్పందించకపోవడంతో గ్రామానికి చెందిన పోలంరెడ్డి బాలకృష్ణ జేసీబీ యంత్రంతో రోడ్డుపై పడ్డ వృక్షాన్ని తొలగించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.