'ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలుప్రశాంతంగా నిర్వహించాలి'

అన్నమయ్య: జిల్లాలో ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు ప్రశాంత వాతావరణంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు తెలిపారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్‌లో ఇంటర్మీడియట్, జిల్లా విద్యాశాఖ కమిటీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.