VIDEO: నీరు లేక ఎండుతున్న పొలాలు.. ఆందోళనలో రైతులు

WGL: సాగునీరు లేక పర్వతగిరి మండలం రావూరులో పంట పొలాలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పొట్ట దశకు చేరుకున్న వరిచేలు పశువులకు మేతగా మారాయని మంగళవారం బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బావులు, బోర్లు ఎండిపోవడంతో పంటలసాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతుల వాపోతున్నారు. ఎస్సార్ఎస్పీ జలాలు కెనాల్ కాల్వ ద్వారా వదలాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.