రెండు లారీలు ఢీ.. ఇరువురికి తీవ్ర గాయాలు

MHBD: కురవి మండలం కొత్తూరు గ్రామ సమీపాన బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఒక దానికొకటి ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు కూడా లారీల ముందుభాగంలో చిక్కుకుపోయారు. ఇట్టి సంఘటనను గమనించిన స్థానికులు 108కు సమాచారంను అందించగా వారు ఘటన స్థలానికి వెళ్లి తీవ్ర రక్తస్రావంలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు.