VIDEO: రాజోలులో 'MSVG' 50 రోజులు వేడుక

VIDEO: రాజోలులో 'MSVG' 50 రోజులు వేడుక

కోనసీమ: సంక్రాంతి పండుగకు విడుదలై ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం 'మన శంకర్ వరప్రసాద్ గారు' అర్థ శత దినోత్సవ వేడుక సోమవారం ఘనంగా జరిగింది. రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో తాటిపాకలో సంబరాలు నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షులు గుండాబత్తుల తాతాజీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.