మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేపలు

KKD: కాకినాడ తీరంలో మత్స్యకారులకు అరుదైన చేపలు చిక్కి స్థానికుల దృష్టిని ఆకర్షించాయి. సముద్ర యాత్రకు వెళ్లిన మత్స్యకారుల వలకు వీటిలో అనేకం చిక్కాయి. వాటిని కాకినాడ కుంభాభిషేకం రేవు వద్దకు తీసుకువచ్చి విక్రయించారు. వీటిని స్థానికంగా నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు. సైజు ఆధారంగా కిలో ధర రూ. 250 వరకూ విక్రయించారు