'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

'ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దు'

VSP: కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్నికేవలం ఒక సంక్షేమ పథకంగా మార్చే ప్రయత్నాలను ప్రజలందరూ ప్రతిఘటించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరవాడలో మంగ‌ళ‌వారం నిరసన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరణతో 'మహాత్మాగాంధీ' పేరు తొలగించ‌డం స‌రికాదన్నారు.