నేడు హైదరాబాద్‌కు అఖిలేష్
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. మ.12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మాజీ ఎంపీ అంజన్ కుమార్ అధ్వర్యంలో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రికి హోటల్ తాజ్ కృష్ణలో బస చేయనున్నారు. రేపు ప్రైవేట్ మీటింగ్‌లో పాల్గొని సా.4 గంటలకు యూపీకి తిరిగి వెళ్లనున్నారు.