VIDEO: 'కేసుల పేరుతో ప్రతిపక్షంపై వేధింపులు'
MHBD: తొర్రూరు పట్టణం BRS పార్టీ కార్యాలయం బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసుల పేరుతో ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేటీఆర్‌లపై కేసులు పెట్టడం, కేసీఆర్‌పై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోసం చేసి అధికారంలోకి వచ్చిన సీఎంకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.