ఐబొమ్మ క్లోజ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!!

ఐబొమ్మ క్లోజ్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..!!

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులకు చిక్కడంతో ఆ వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో నెటిజన్లు 'ఇక సెలవు మామా.. నీ సేవలతో అన్ని సినిమాలు చూశాం. నువ్వు మా దేవుడివి. ప్రీమియర్ల పేరుతో సినీ పెద్దలు చేసే దోపిడీని అడ్డుకున్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు 'ఇక పైరసీకి తెర పడింది. సినీ పరిశ్రమ కోలుకుంటుంది' అని పలువురు రాసుకొస్తున్నారు.