జల సంరక్షణలో రాష్ట్రానికి మొదటి స్థానం
AP: గ్రామాల్లో జల సంరక్షణకు సంబంధించి 'జల సంచాయ్-జన భాగిదారి' కార్యక్రమం అమల్లో జాతీయ స్థాయిలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అత్యధికంగా ఈ ఏడాది 4,20,146 పనులు ప్రారంభించి, ఇప్పటివరకు 2,99,114 పూర్తి చేసింది. మిగతా 1,21,032 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కార్యక్రమం అమలును సమీక్షించిన కేంద్రం మొదటి పది రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.