అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ATP: ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో శనివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఎర్రిస్వామి(53) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.