కంభంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

కంభంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని జంగం గుంట్ల గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి షేక్ మొహమ్మద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన శనగ పంటలో విత్తన శుద్ధి మరియు ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్ఎ లక్ష్మి, రైతులు పాల్గొన్నారు.