ట్రంప్ సంతకం.. సుదీర్ఘ షట్‌డౌన్‌కు ముగింపు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు బిల్లుపై సంతకం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే 43 రోజుల సుదీర్ఘ ప్రభుత్వ షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు పడింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యకలాపాలు తక్షణమే పునఃప్రారంభం కానున్నాయి. తద్వారా ప్రభుత్వ సేవలు అందక ప్రజలు పడిన ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.