పల్లెపోరులో 111 మంది సర్పంచ్ అభ్యర్థులు

పల్లెపోరులో 111 మంది సర్పంచ్ అభ్యర్థులు

KNR: నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికల అంతిమ ఘట్టం మొదలైంది. శంకరపట్నం మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు గాను, మొత్తం 111 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పంచాయతీలలో 48 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మిగిలిన 192 వార్డులకు 493 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్లు ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు.