ఏఐ టాపర్ కు బీజేపీ నేతల సన్మానం
KMM: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రామింగ్‌లో జాతీయ స్థాయి టాపర్ గా నిలిచిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాల్లూరి పల్లవి ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మంగళవారం పల్లవితో పాటు ఆమె తల్లిదండ్రులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు తదితరులు సన్మానించారు.