ప్లాస్టిక్ గ్లాసులకు చెక్.. గాజు గ్లాసుల వినియోగానికి ప్రోత్సాహం
KMR: పల్లె బోగుడ తండా గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ పార్వతి శంకర్ ఆధ్వర్యంలో చాయ్ హోటళ్లలో ప్లాస్టిక్ గ్లాసులను తొలగించి గాజు గ్లాసుల్లో మాత్రమే చాయ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 150 గాజు గ్లాసులను హోటళ్లకు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ గ్లాసుల్లో చాయ్ ఇచ్చినా, తాగినా రూ.3,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.