భారత్ vs పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు!
2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం ICC కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. ఇందులో పురుషుల, మహిళల విభాగాల్లో చెరో 6 జట్లు పోటీపడతాయి. ప్రతి ఖండం నుంచి టాప్ జట్లను మాత్రమే ఎంచుకునే విధివిధానాలను ICC అమలు చేయాలని యోచిస్తోంది. దీని కారణంగా ఆసియా నుంచి కేవలం ఒకే జట్టు అర్హత సాధిస్తే, భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.