'మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష'

'మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష'

VZM: ఎస్‌.కోట్‌ పరిధిలో మద్యం సేవించి బైక్ నడపిన శివరామరాజుపేటకు చెందిన కపిరెడ్డి అప్పారావుకు స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గండి అప్పలనాయుడు 7 రోజుల జైలు శిక్షను విధించారని SP దామోదర్ వెల్లడించారు. బుధవారం డ్రంక్ & డ్రైవ్ కేసులో జైలు శిక్ష పడిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇకపై జైలు శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.