VIDEO: 'జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి'
NZB: అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకంతో గెలిపించిన ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ, వారికి మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు బోర్గం(పి)లో మేయర్, ఛైర్‌పర్సన్, కార్పోరేటర్లకు గురువారం నిర్వహించిన శిక్షణా తరగతుల్లో కలెక్టర్ మాట్లాడారు. హక్కులు, అధికారాలతో పాటు బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.