రేపు నగరంలో పీజీఆర్ఎస్

SKLM: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో రేపు జరగనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యల నమోదుకు Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తు ఇచ్చిన అనంతరం తదుపరి సమాచారానికి 1100 నెంబర్‌కు నేరుగా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.