ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
KMR:రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ పట్టణంలోని బస్‌స్టాండ్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో విజయ్(38) అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో స్థానిక అసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా ప్రమాదం జరిగిందని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు.