రేపు కనిగిరి మండల సర్వసభ్య సమావేశం

రేపు కనిగిరి మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30లకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఖాదర్ బాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల ఎంపీపీ దంతులూరి ప్రకాశం అధ్యక్షుతన జరిగే ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ, సర్పంచులు అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలన్నారు.