వీరేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్ కు రూ.75 వేలు విరాళం

వీరేశ్వర స్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్ కు రూ.75 వేలు విరాళం

కోనసీమ: ఐ. పోలవరం మండలం మురముళ్ళలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి వారిని ఖమ్మంకి చెందిన కొమ్ము ముక్కల సాయి ప్రతాప్ కుటుంబసభ్యులు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారు ఆలయం లో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి రూ. 75 వేలు విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలను ఆలయ ఈవో సత్కరించి స్వామి వారి చిత్రపటం అందజేసారు.