ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలి: నంద్యాల కలెక్టర్

నంద్యాల జిల్లాకు 59,239 ఇళ్లు మంజూరు కాగా, అందులో 31,682 ఇళ్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మిగిలిన ఇళ్లను డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఐహెచ్ఐచ్ఎల్ టాయిలెట్లు 23,707 మంజూరు కాగా, 11,661 పూర్తయ్యాయని, చెంచు గిరిజనులకు 526 ఇళ్లలో 221 పూర్తయ్యాయని వెల్లడించారు.