'రాజకీయ సంస్థలా టీజీపీఎస్సీ'

'రాజకీయ సంస్థలా టీజీపీఎస్సీ'

NGKL: సింగిల్ విండో ఫంక్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో స్వేరోస్ నాయకులు గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై మాట్లాడారు. రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ.. టీజీపీఎస్సీ రాజకీయ సంస్థలా వ్యవహరిస్తోందని, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెం. 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.