రిజర్వాయర్ హత్య కేసులో నలుగురు అరెస్టు

రిజర్వాయర్ హత్య కేసులో నలుగురు అరెస్టు

సత్యసాయి: బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్‌లో ఆగస్టు 8న జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దర్యాప్తులో భాగంగా నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అక్రమ సంబంధం కారణంగా పథకం ప్రకారం భర్త రామప్ప హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. టెక్నికల్ ఆధారాలతో కేసు ఛేదించామని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు.