ఇరిగేషన్ శాఖ అధికారులతో MLA గండ్ర సమీక్ష

ఇరిగేషన్ శాఖ అధికారులతో MLA గండ్ర సమీక్ష

BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఇరిగేషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.