నేడు అర్జీలు స్వీకరించనున్న ఎమ్మెల్యే శ్రావణి
ATP: నార్పల ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో మమత తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు తమ సమస్యలు అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందిచవచ్చని సూచించారు. అలాగే, ప్రభుత్వ అధికారులంతా హాజరు కావాలన్నారు.