ప్రభుత్వ పాఠశాలలో శానిటేషన్ నిర్వహించాలని వినతి
KRNL: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని కర్నూలు అర్బన్ ఎంఈఓ -2 అబ్దుల్ రెహమాన్ బుధవారం కేఎంసీ అడిషనల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అదనపు కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు. పాఠశాల ఆవరణ శుభ్రం చేయించేందుకు శానిటేషన్ వర్కర్స్‌ను కేటాయిస్తామని చెప్పినట్లు తెలిపారు.