ఇద్దరి పిల్లలతో సహా.. అంగన్వాడీ టీచర్ అదృశ్యం

MBNR: ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన సంఘటన బాలానగర్ మండలంలో జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. వనమోనిగూడ గ్రామానికి చెందిన అంగన్వాడి టీచర్ అబ్బవత్తిని లత.. ఈనెల 16వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో నుంచి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని.. అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.