'పల్లెల్లో స్థానిక సందడి... బరిలో ఆశావాహులు'
MHBD: రిజర్వేషన్ ఖరారుతో తొర్రూరు మండల వ్యాప్తంగా గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో వేట కొనసాగిస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థుల గెలుపు, ఓటములను పార్టీలు అంచనా వేస్తున్నాయి. తొర్రూరు మండలంలో 31 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.